‘Thalapathy67’లో విజయ్ గ్యాంగ్‌స్టార్‌గా కనిపించనున్నాడా?
Vijay Thalapathy-Lokesh Kanagaraj Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తలపతి విజయ్. 'తుపాకీ' నుండి 'మాస్టర్' వరకు ఈయన నటించిన సినిమాలన్ని తెలుగులోనూ రిలీజై మంచి విజయాలు సాధించాయి.
Vijay Thalapathy-Lokesh Kanagaraj Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తలపతి విజయ్. ‘తుపాకీ’ నుండి ‘మాస్టర్’ వరకు ఈయన నటించిన సినిమాలన్ని తెలుగులోనూ రిలీజై మంచి విజయాలు సాధించాయి. ఈ ఏడాది ‘బీస్ట్’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విజయ్.. ఈ సారి ‘వారసుడు’ తో ఎలాగైన బ్లాక్‌బస్టర్ సాధించాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. విజయ్, లోకేష్ కనగరాజు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా గ్యాంగ్‌స్టార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. అంతేకాకుండా ఈ చిత్రంలో విజయ్ ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈయనకు లుక్ టెస్ట్‌లు కూడా జరిపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కనుందట. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇటీవలే విక్రమ్‌తో రికార్డులు సృష్టించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంతో ఇంకా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

