Super Star Mahesh Babu | సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్ ప్రస్తుతం మంచి స్పీడ్‌లో ఉంది. ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే.. రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.
మహేష్ ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. తరచూ ఫోటోలను షేర్ చేస్తూ, ట్వీట్లు చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. కాగా తాజాగా ఈయన అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ట్విట్టర్లో తాజాగా ఈయన 13మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటుడిగా అరుదైన ఘనత సాధించాడు. తర్వాతి స్థానాల్లో ధనుష్ సూర్య ఉన్నాడు. టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ 5వ స్థానంలో ఉన్నాడు.