Balakrishna | చిరు రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. బాలకృష్ణ చాన్స్ ఇచ్చాడా?
Balakrishna Next Movie | చాలా కాలం తర్వాత 'అఖండ'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అదే జోష్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు.
Balakrishna Next Movie | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అదే జోష్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య, అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు.
ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో సాగే ఈ చిత్రంలో బాలయ్య 50ఏళ్ల వయసు గల తండ్రి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన చిత్రబృందం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా తాజాగా బాలయ్య ఓ టాలీవుడ్ యంగ్ దర్శకుడికి చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ, ‘ఛలో’ ఫేం వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చినట్లు టాక్. తాజాగా వెంకీ, బాలయ్యకు ఓ ఫ్యామిలీ స్టోరీని వినిపించాడట. బాలకృష్ణకు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా వెంకీ కుడుముల తన మూడో సినిమాను చిరుతో చేయాల్సి ఉంది. కానీ చిరుకు ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.
Read Also:
Mahesh Babu | సూపర్‌స్టార్ అరుదైన ఘనత.. సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
Kantara Movie | ‘కార్తికేయ-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘కాంతార’..!
Harish Kalyan | ఘనంగా ‘జెర్సీ’ నటుడి వివాహం.. ఫోటోస్ వైరల్
Rudhrudu Movie | లారెన్స్ ‘రుద్రుడు’ మూవీ క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

