Rudhrudu Movie Latest Update | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కేవలం కొరియాగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లారెన్స్ నటుడుగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘రుద్రన్’ మూవీ ఒకటి. తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో విడుదల కానుంది. కదిరేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ప్రకటించింది.
శనివారం లారెన్స్ బర్త్‌డే సందర్భంగా ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. లారెన్స్‌కు జోడీగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా నాలుగు నెలలు వాయిదా పడింది.
. @offl_Lawrence 's Birthday Glimpse from #Rudhrudu releasing Tomorrow @ 5 PM!! 🔥💥#ருத்ரன் #రుద్రుడు #ನಮ್ಮರುದ್ರ #രുദ്രൻ#HBDRaghavaLawrenceMaster
— Maduri Mattaiah (@madurimadhu1) October 28, 2022
Read Also:
Kantara Movie | ‘కార్తికేయ-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘కాంతార’..!
Harish Kalyan | ఘనంగా ‘జెర్సీ’ నటుడి వివాహం.. ఫోటోస్ వైరల్
Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
ప్రభాస్‌కు మూడో హీరోయిన్ దొరికేసింది.. ఈ సారి ఏకంగా కన్నడ భామనే లైన్లో పెట్టేశారు..!