Harish Kalyan | ఘనంగా ‘జెర్సీ’ నటుడి వివాహం.. ఫోటోస్ వైరల్
Harish Kalyan Wedding | కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ శుక్రవారం ఘనంగా వివాహం చేసుకున్నాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నర్మద ఉదయ్‌కుమార్‌ను హరీష్ కళ్యాణ్ పెళ్ళి చేసుకున్నాడు.
Harish Kalyan Wedding | కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ శుక్రవారం ఘనంగా వివాహం చేసుకున్నాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నర్మద ఉదయ్‌కుమార్‌ను హరీష్ కళ్యాణ్ పెళ్ళి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలోని తిరువేర్కుడు జీపీఎస్ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీళ్ల పెళ్ళి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
‘సింధు సమవేలి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హరీష్.. అనతికాలంలో వరుస సినిమాలతో కోలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఈయన ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘జై శ్రీరామ్’ సినిమాలో చిన్న రోల్ చేశాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ‘జెర్సీ’లో నాని కొడుకుగా గెస్ట్ రోల్లో నటించాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. ఇక ధోని నిర్మించబోయే సినిమాలో కూడా హీరోగా హరీష్ కళ్యాణ్ ఎంపికైనట్లు సమాచారం. అంతేకాకుండా హరీష్ కళ్యాణ్ తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో రన్నర్‌గా నిలిచాడు. అప్పటి నుండి ఈయనకు కోలీవుడ్‌లో మరింత ఫాలోయింగ్ పెరిగింది.
.@iamharishkalyan with his beautiful bride #NarmadaUdayakumar at the sacred wedding ceremony..#HarishKalyanWedding #harishkalyan pic.twitter.com/AmJs0AinGC
— Jaya TV (@JayaTvOfficial) October 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

