Prithiveeraj Second Marriage | నటుడు పృథ్వీ గుర్తున్నాడా? విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ నటుడి పెళ్లి వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. 56 ఏళ్ల వయసు ఉన్న పృథ్వీ.. మలేసియాకు చెందిన 24 ఏళ్ల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వార్తలపై పృథ్వీ స్పందించాడు. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తానెవరినీ రెండో పెళ్లి చేసుకోలేదని పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తాను ఒక అమ్మాయితో కొంతకాలంగా రిలేషన్లో ఉన్నానని చెప్పాడు. తనకు ఇప్పుడు 56 సంవత్సరాలని.. అదే ఆ అమ్మాయికి 24 సంవత్సరాలని తెలిపాడు. అందరూ అనుకుంటున్నట్టు ఆమె మలేసియా అమ్మాయి కాదు.. తెలుగమ్మాయే అని స్పష్టం చేశాడు. తన పేరు శీతల్ అని చెప్పాడు. తనతో పెళ్లికి శీతల్ సిద్ధంగా ఉందని తెలిపాడు. నిజానికి తొలుత ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఒప్పుకోలేదని.. ఆలోచించుకోమని సలహా ఇచ్చానన్నానడు. కానీ శీతల్ తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందని చెప్పుకొచ్చాడు. తమ పెళ్లికి శీతల్ ఫ్యామిలీ కూడా ఒప్పుకుందని పేర్కొన్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్లో ఉన్నామని తెలిపాడు.
1994లో బీనా అనే యువతితో పృథ్వీకి పెళ్లి అయింది. అయితే గత ఆరేళ్లుగా బీనా, పృథ్వీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె నుంచి విడిపోయిన పృథ్వీ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శీతల్ పరిచయమైందని, తమ అభిరుచులు కలవడంతో స్నేహితులం అయ్యామని.. ఆ తర్వాత ప్రేమలో పడ్డామని పృథ్వీ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధమేంటి? ఎవరు ఎప్పుడు ఏ వయసులో ప్రేమలో పడుతారో ఎవరు చెప్పగలరు అంటూ వేదాంతం కూడా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇప్పటికి పెళ్లి కాకపోయినా.. త్వరలోనే అవుతుంది అన్నట్టుగా సమాధానం చెప్పాడు పృథ్వీ.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఆయన నటించిన తొలి చిత్రానికే ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి పందిరి, సమరసింహారెడ్డి, పంచదార చిలక, ప్రేయసి రావె, దేవుళ్లు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి