పూరి జగన్నాథ్-రవితేజ ఈ కాంబినేషన్ సూపర్‌హిట్..! ఎందుకంటే అప్పటి వరకు సినిమాలో సహాయ నటుడి పాత్రలు చేసుకుంటున్న రవితేజను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోని చేశాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా హిట్ అయిన తరువాత రవితేజతో ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి వంటి మరో రెండు సూపర్హిట్లు ఇచ్చి రవితేజ కెరీర్‌ను ఊపందుకునేలా చేశాడు. ఇక అప్పటి నుంచి రవితేజ వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నేనింతే అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు రవితేజ, పూరి జగన్నాథ్ సినిమాకు పోటీగా వచ్చాడు.
రామ్ పోతినేని, పూరి కలయికలో రూపొందుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్‌ను ఆగస్టు 15న విడుదల చేస్తున్నామని తొలుత ప్రకటించారు పూరి జగన్నాథ్. అయితే ఆ తరువాత సడెన్‌గా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ ను కూడా అదే రోజు విడుదల చేస్తున్నామని అనౌన్స్ చేశారు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్. అయితే ముందుగా ఆడేట్ను తన సినిమా వస్తున్నామని ప్రకటించినా రవితేజ తన సినిమాకు పోటీగా రావడం పట్ల పూరి రవితేజపై కాస్త అసంతృప్తితో వున్నట్లు తెలిసింది.
అంతేకాదు ఇటీవల పూరి కనెక్ట్స్ తరపున నిర్మాత ఛార్మి కౌర్ ఈ విషయం మాట్లాడానికి రవితేజను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పీపుల్స్ మీడియాతో సంప్రందించిన ఫలితం లేకపోయింది. అయితే ఎంతైనా డబుల్ ఇస్మార్ట్ విడుదల రోజే మరో మాస్ హీరో, మాస్ దర్శకుడి కాంబోలో సినిమా విడుదల కావడం డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ విషయంలో రవితేజ, పూరి జగన్నాథ్‌ల మద్య డైరెక్ట్ వార్ లేకపోయినా ఇద్దరి మధ్య ఓ రకమైన స్తబ్ధత నెలకొని వున్న మాట వాస్తవమేనని అంటున్నాయి సినీ వర్గాలు.
Also Read :
Raayan Movie | ‘రాయన్’ మేకింగ్ వీడియో రిలీజ్.. ధనుష్ డైరెక్షన్ ఎలా చేశాడో చూడండి.!
Avengers: Doomsday | ‘మార్వెల్’ నుంచి మరో క్రేజీ మూవీ.. ‘డాక్టర్ డుమ్’గా ఐరన్ మ్యాన్ నటుడు