Sharwa 38 | వరుస సినిమాలను లైన్లో పెట్టిన యాక్టర్లలో ఒకడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand). శర్వానంద్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి శర్వా 38 (Sharwa 38). సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారని తెలిసిందే. పోస్టర్లో నీటిపై మంటలను చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్.
శర్వానంద్ 38 సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. సినిమా సెట్ వర్క్ కోసం సంప్రదాయ బద్దంగా భూమి పూజ నిర్వహించారు. డైరెక్టర్ సంపత్‌నంది, నిర్మాత కేకే రాధామోహన్తోపాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇక భయం ప్రపంచాన్ని హింసతో రౌండప్ చేసినప్పుడు.. కొత్త ప్రపంచాన్ని రూపొందించడానికి రక్తం ఆయుధంగా మారుతుంది.. అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36 మూవీ చేస్తున్నాడు.
మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. దీంతోపాటు సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న Sharwa 37లో కూడా నటిస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్ అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ లుక్ అందరితో పంచుకుంది.
శర్వా 38 టీం భూమి పూజ..
Team #Sharwa38 has kicked off the set work with a traditional Bhoomi Pooja 🙏🏻#SharwaSampathBloodFest 🔥 pic.twitter.com/y8D6a75e8i
— BA Raju’s Team (@baraju_SuperHit) October 16, 2024
అనౌన్స్మెంట్ పోస్టర్..
#Sharwa38 @ImSharwanand @IamSampathNandi team up ! #SharwaSampathBloodFest 🔥 pic.twitter.com/FaZy8idpdo
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2024
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్