టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీని మెహర్ రమేశ్ (Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) హీరోయిన్గా నటిస్తోంది. భోళాశంకర్ టీం నుంచి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
నవంబర్ 6న సినిమాను లాంఛ్ చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నవంబర్ 15 నుంచి భోళా శంకర్ షూటింగ్ షురూ కానుంది. తొలి షెడ్యూల్లో చిరంజీవి, కీర్తిసురేశ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరో అప్డేట్ ఏంటంటే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న తమన్నా వచ్చే జనవరి నుంచి సెట్స్ లో జాయిన్ కానుంది. తాజా అప్డేట్తో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు చిరు.
కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య వచ్చే ఏడాది పిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం లూసిఫర్‌కు రీమేక్ (Godfather) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు చిరు. గాడ్‌ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా డైరెక్టర్. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్