Darshan | రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అతడి స్నేహితురాలు, నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని అరెస్ట్ చేశారని తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కొన్ని నెలలుగా దర్శన్ అండ్ టీం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఇటీవలే నిందితులపై ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు.
కాగా దర్శన్‌కు మరోసారి చుక్కెదురైంది. దర్శన్ బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టేసింది. కోర్టు దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది.
పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్