ఛత్రపతి రీమేక్‌తో హిందీ ఇండస్ట్రీ (Bollywood)లోకి అడుగుపెడుతున్నాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas). రీమేక్‌కు వివి వినాయక్ (V V Vinayak) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను బెల్లంకొండ అందరితో పంచుకున్నాడు.
బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) రీమేక్ ప్రాజెక్టులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లొకేషన్లో జానీ లివర్‌తో దిగిన అరుదైన క్షణాలను షేర్ చేసుకున్నాడు బెల్లంకొండ. ఆయనతో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న స్టిల్‌ను షేర్ చేశాడు. లెజెండరీ నటులు జానీ లివర్ సార్‌తో కలిసి నటించే అరుదైన అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్ లోకి వచ్చిన తర్వాత ఆయన అందరికీ ఎనర్జీ అందరినీ కట్టిపడేసింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా ఈ చితర్ఆన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Honoured to have gotten an opportunity to share screen space with the legendary actor Johny Lever Sir. The energy he brings to the set is really infectious @iamjohnylever pic.twitter.com/wAh5zV4YH4
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) November 9, 2021
ఈ మూవీలో హీరోయిన్గా పలువురు పేర్లు తెరపైకి వచ్చినా..ఇంకా ఎవరనేది ఫైనల్ కాలేదు. ఎస్ఎస్ రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన ఛత్రపతి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టింది. మరి ఈ బ్లాక్ బాస్టర్ రీమేక్ హిందీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!