Raashi Khanna | నటన ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటూ సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి రాశీఖన్నా. టాలీవుడ్‌లోని స్టార్ కథానాయకులతో వరుసగా సినిమాలను చేస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె అరడజనుపైగా సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. అయితే ఈమె తన కెరీర్ తొలినాళ్ళకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
రాశీఖన్నా తొలినాళ్ళలో కాపి రైటర్ కావాలని అనుకుందట. దాని కోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చెద్ధామని భావించిందట. కానీ అంతలోపే ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చిందట. దాని తర్వాత అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌తో రాశీని సంప్రదించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా కాపి రైటర్ అవ్వాలనుకున్న రాశీఖన్నా అనుకోకుండా నటిగా మారింది. నటిగానే కాదు ఈమెకు గాయకురాలిగా కూడా మంచి పేరుంది. ప్రస్తుతం ఈమె గోపించంద్ ‘పక్కాకమర్షియల్’, నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమాలలో హీరోయిన్గా నటించింది. వీటితో పాటుగా కార్తీ ‘సర్ధార్’, ధనుష్ ‘తిరుచిత్రంబలం’ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఇవి రెండు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి: