Srikanth Meka | విలన్‌గా బిజీ అవుతున్న సీనియర్ హీరో శ్రీకాంత్
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి విభిన్న పాత్రలతో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.
Srikanth Meka | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి విభిన్న పాత్రలతో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. కెరీర్ ఆరంభంలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ క్రమేనా ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలదొక్కుకున్నాడు. కుంటుంబ కథా చిత్రాలకు శ్రీకాంత్ కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తీరిక లేకుండా గడుపుతున్నాడు.
ఈయన కూడా జగపతిబాబు లానే విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలిన ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన్న ‘యుద్ధం శరణం’ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో ఈయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక లేటెస్ట్గా ఈయన ‘అఖండ’ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా నటించాడు. సినిమా విడుదలకు ముందు మేకర్స్ విడుదల చేసిన శ్రీకాంత్ పోస్టర్లు ట్రైలర్లు ఈయన విలనిజం ఎలా ఉంటుందో అని అసక్తిరేపాయి. కానీ సినిమా విడుదల తర్వాత ఈయన మెయిన్ విలన్ కాకపోవడం. ఈయన పాత్రకు అంతగా స్కోప్ ఉండకపోవడంతో ఈయన విలనిజంను ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోయారు. ‘లేజెండ్’లో జగపతిబాబు స్థాయిలో ఈయన క్యారెక్టర్ ఉంటుందని అందురూ భావించారు. థియేటర్లకు వెళ్ళిన అభిమానులు ఈయన పాత్ర తీవ్రంగా నిరాశ పరిచింది.
ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ఈయన క్యారెక్టర్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్రను డిజైన్ చేసిన తీరును చూసి ఎవరైన సరే షాక్ అవుతారు అని శ్రీకాంత్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రం శర వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. దీనితో పాటు తమిళంలో కూడా ఓ సినమాలో విలన్‌గా చేస్తున్నాడు. కన్నడ, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఈయనకు విలన్‌గా అవకాశాలు వస్తున్నాయట. శ్రీకాంత్ కూడా జగపతిబాబు లాగానే మరో స్టార్ విలన్‌గా మారుతాడు అని నెటీజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Puneeth Rajkumar Fan | ‘జేమ్స్’ సినిమా సంబురాల్లో.. ఆగిపోయిన పునీత్ అభిమాని గుండె
The Kashmir Files | తెలుగులోనూ విడుదల కానున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం
Venkatesh | ‘జాతిరత్నాలు’ దర్శకుడితో.. వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడా?
Ram Charan | రామ్‌చరణ్ ఇన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- srikanth meka
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

