The Kashmir File | దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే. గతవారం రోజుల నుంచి ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా మర్చి 11న విడుదలై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 100కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులతో పనేముంది అని ఈ చిత్రం నిరూపించింది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? ఎలా చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రాన్ని కేవలం నార్త్‌కే పరిమింతం చేయకుండా దేశం మెత్తానికి ఈ కథ గురించి తెలియాలని సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.