Venkatesh | ‘జాతిరత్నాలు’ దర్శకుడితో.. వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడా?
సీనియర్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూ ఉంటాడు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విక్టరి వెంకటేష్ అనేంతలా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు.
Venkatesh-Anudeep Movie | సీనియర్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూ ఉంటాడు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విక్టరి వెంకటేష్ అనేంతలా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎఫ్-3’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా రానాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూపొందిస్తున్న ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. వీటి తర్వాత ఈయన నుంచి రాబోతున్న సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో తేజతో సినిమా ఉంటుందని, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ వీటిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం వెంకీ ఓ యువ దర్శకుడితో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడని టాక్.
‘జాతిరత్నాలు’ సినిమాతో నటులతో సమానంగా పాప్యులారిటీని సంపాందించుకున్న దర్శకుడు అనుదీప్. సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం చేసిన ప్రమోషన్లలో ఈయన అల్లరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక విధంగా అనుదీప్ వల్ల కూడా సినిమాకు బాగా ప్రమోషన్ అయిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఈయన రాసిన వన్ లైనర్స్ పంచ్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈయన ప్రస్తుతం తమిళ స్టార్ శివకార్తికేయన్‌తో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈయన వెంకీకు ఓ ఫ్యామిలీ యాక్షన్ కథను చెప్పాడట. దానికి వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సామాచారం. శివకర్తికేయన్ సినిమా తర్వాత అనుదీప్ ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
వెంకటేష్ నటించిన ‘ఎఫ్-3- మే 27న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. గతనెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ఎఫ్-2’కి సీక్వెల్‌గా తెరకెక్కింది. తమన్నా, మెహరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం డబ్బు నేపథ్యంలో తెరకెక్కిందని సమాచారం. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

