Puneeth Rajkumar Fan Death | కన్నడ స్టార్ హీరో పునీత్‌రాజ్ కుమార్ ఆకస్మిక మరణం కన్నడ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. 46 ఏళ్ళకే ఈయన గుండెపోటుతో మరణించాడు. ఈ వార్తతో సినీప్రముఖులు, అభిమానులు కన్నీరు మున్నీరైయ్యారు. ఈయన మరణించి నాలుగు నెలలు దాటిన ఆ బాధ నుంచి అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మర్చి 17న గ్రాండ్‌గా విడుదలైంది. పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళిగా వారం రోజుల పాటు కర్ణాటకలోని అన్ని థియేటర్లలో జేమ్స్ చిత్రాన్ని ప్రదర్శితం చేసేలా డిస్ట్రిబ్యూటర్లు తీర్మానించుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అభిమానులు రిలీజ్ సంబురాలు పెద్ద ఎత్తులో నిర్వహించారు. ఈ క్రమంలో పునీత్ అభిమాని గుండె పోటుతో మరణించాడు. మైసూరులోని హెడియాల గ్రామంలో ‘జేమ్స్’ విడుదల
సందర్భంగా గురువారం జరిగిన సంబురాల్లో ఆకాశ్ అనే అభిమానికి హటాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆకాశ్‌ను హస్పిటల్‌కు తరలిస్తుండగానే మార్గం మధ్యలో మరణించాడు. ఈ వార్త పునీత్ అభిమాన సంఘాల్లో మరో విషాదాన్ని నింపింది.