Ram Charan | రామ్‌చరణ్ ఇన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడా?
మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దలంటుంటారు. సినిమా రంగంలో కూడా కథల విషయంలో కూడా హీరోలు చేసే సినిమాలపై వారి పేర్లు రాసుండాలి అంటారు.
Ram Charan | మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని పెద్దలంటుంటారు. సినిమా రంగంలో కూడా కథల విషయంలో హీరోలు చేసే సినిమాలపై వారి పేర్లు రాసుండాలి అంటారు. ఒక హీరో దగ్గరకు వచ్చిన కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సాధారణంగా జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని కథలు బ్లాక్బాస్టర్లు అవగా మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అలా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వదలుకున్న హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు ఏంటో ఒక లుక్కేద్ధాం.
ఎటోవెళ్ళిపోయింది మనసు:
గౌతమ్ మీనన్ మొదట ఈ కథను రామ్‌చరణ్‌కు వినిపించాడట. కానీ రామ్‌చరణ్‌కు ఈ కథ నచ్చకపోవడంతో నాని దగ్గరికి వెళ్ళిందట. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అంతగా ఆడకపోయినా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం 5నంది అవార్డులను గెలుచుకుంది
సూర్య సన్నాఫ్ క్రిష్ణన్:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘సూర్య సన్నాఫ్ క్రిష్ణన్’. మొదట ఈ కథ రామ్‌చరణ్ దగ్గరకు వెళ్ళిందట. రామ్‌చరణ్‌కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. కానీ అప్పుడు ‘మగధీర’తో బిజీగా ఉండటంతో ఈ కథ సూర్య దగ్గరికి వెళ్ళిందట. సూర్య కెరీర్లోనే బెస్ట్ క్లాసిక్‌గా ఈ సినిమాను ఇప్పటికి చెప్పుకుంటారు.
లీడర్:
రానా కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా చెప్పుకునేది ‘లీడర్’. మొదట ఈ చిత్రం శేఖర్ కమ్ములా రామ్‌చరణ్‌కు వినపించాడట. కాథ నచ్చినప్పటికి రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడట. తరువాత ఈ కథ బన్నీ దగ్గరకు వెళ్ళిందట. కానీ చివరికి రానాకు వరించింది. మెదట సురేష్ బాబు ఈ చిత్రాన్ని వెంకీతో చేయాలని ప్లాన్ చేశాడట. కానీ రానాకు డెబ్యూ సినిమాగా ఇదైతేనే బాగుంటుందని రానాతో ఈ చిత్రాన్ని రూపొందించాడు.
డార్లింగ్:
‘డార్లింగ్’ సినిమా కూడా మొదట రామ్‌చరణ్ దగ్గరకు వెళ్ళిందట. రామ్‌చరణ్ ఈ కథకు ప్రభాస్ అయితే పర్ఫెక్ట్గా సెట్టవుతాడని కరుణాకరణ్‌కు సూచించాడట.ఈ చిత్రం ప్రభాస్ గ్రాఫ్‌ను పెంచింది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ప్రభాస్‌కు డార్లింగ్ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది.
శ్రీమంతుడు:
కొరటాల శివ మొదట ఈ కథను రామ్‌చరణ్‌కు వినిపించాడట. రామ్‌చరణ్‌కు ఈ కథ బాగా నచ్చిందట. కానీ అప్పుడప్పుడే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంటున్న రామ్‌చరణ్‌కు ఈ కథ రిస్క్ అనిపించిదట. దాంతో ఈ చిత్రం మహేష్ దగ్గరకు వెళ్ళింది. ఈ చిత్రం కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్‌ను సాధించింది.
ఇవేకాకుండా రానా ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మనం’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘నేల టిక్కెట్’, ‘ఓకే బంగారం’ వంటి సినిమాలు మొదట రామ్‌చరణ్ దగ్గరకు వెళ్ళినవే. కొన్ని కథలు రామ్‌చరణ్‌కు నచ్చక పోతే మరికొన్ని నచ్చి కూడా కొన్ని కారణాల వల్ల వదులు కున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

