Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం తన నటనకు జోహార్లు కొట్టేలా చేసాడు విజయ్ దేవరకొండ. సినీరంగంలో హీరోగా ఎంట్రీ అనేది చాలా కష్టం.
Vijay Devarakonda | ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం తన నటనకు జోహార్లు కొట్టేలా చేసాడు విజయ్ దేవరకొండ. సినీరంగంలో హీరోగా ఎంట్రీ అనేది చాలా కష్టం. ఇక హీరోగా అవకాశం వచ్చినా అది నిలబెట్టుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమనే ఆయుధంగా వాడుకొని విజయ్ టాలీవుడ్ టైర్-2 హీరోలలో నెంబర్1 గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. విజయ్ తన తదుపరి సినిమాను కూడా పూరీ దర్శకత్వంలోనే ‘జనగణమన’ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ అది తెరకెక్కడానికి సమయం పడుతుందట. ఈ గ్యాప్‌లో శివనిర్వాణతో విజయ్ లవ్‌స్టోరీ సినమాను చేయనున్నాడు.
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలను తెరకెక్కించే దర్శకుడిగా శివనిర్వాణకు పేరుంది. ఈ చిత్రం కూడా కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉందట. ఏప్రిల్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివనిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’ నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. విజయ్-పూరి కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 25న ప్రేక్షకుల మందుకు రానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అనన్యపాండే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది.
ఇవి కూడా చదవండి:
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Valimai | ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

