Valimai On OTT | తమిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సపరిచితమే. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘వలిమై’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి24న విడుదలై తమిళ నాట భారీ కలెక్షన్లను సాధించింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం 100కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించాడు.
తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’లో ఈ చిత్రం మార్చి 25నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగులో 2.5 కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్గా 2.26కోట్ల కలెక్షన్లను సాధించింది. పోటీగా భీమ్లానాయక్ సినిమా ఉండటంతో ఈ చిత్రం బ్రేక్ఈవెన్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది.