Balakrishna | ఒక కథానాయకుడి సరసన ఒక హీరోయిన్ వుంటేనే మన తెలుగు దర్శకులు పర్ఫార్మెన్స్తో పాటు రొమాన్స్‌ను సగటు ప్రేక్షకుడికి అందించాలని చూస్తారు.. ఇక అదే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ వుంటే.. రొమాన్స్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి పండగే.. ఇక కొంత మంది హీరోల సినిమాల్లో రొమాన్స్ సన్నివేశాలు కూడా ఎక్కువే వుంటాయి. ఇక నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాలో కూడా యాక్షన్‌తో పాటు రొమాన్స్ టచ్ కూడా వుంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరువాత బాలకృష్ణ సినిమాలపై ఫోకస్ చేశాడు.
ప్రస్తుతం ఆయన తన 109వ (NBK 109) చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు పలు డిఫరెంట్ లోకేషన్స్‌ల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు చిత్రంలోని పలు కీలక పాత్రదారులపై చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ నందమూరి హీరో సరసన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ వీళ్లు కూడా షూటింగ్లో పాల్గొంటున్నారట.
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్తోపాటు ఊర్వశి రౌతేలా కూడా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకు ముందు ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణతో అఖండ చిత్రంలో జోడి కట్టిన విషయం తెలసిందే. శ్రద్ధాశ్రీనాథ్‌కు, ఊర్వశీ రౌతేలాకు ఆయనతో నటించడం ఇదే తొలిసారి. అయితే ఇంతకు ముందు ఊర్వశీ రౌతేలా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సరసన ఓ ఐటెమ్ సాంగ్ చేసిన విషయం విదితమే. ఇక ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ రొమాన్స్ ఏ రేంజ్లో వుండబోతుందని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తారట.
Mr Bachchan | రొమాంటిక్ లుక్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ టైం చెప్పిన మేకర్స్
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!