నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటికే నెట్టింట్లో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. త్వరలోనే మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ ఉండబోతుందంటూ ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు బాలకృష్ణ. తనయుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు. నవంబర్ 24న గోవా ఫిలిం ఫెస్టివల్లో అఖండ స్క్రీనింగ్ అయిన విషయం తెలిసిందే.
మోక్షజ్ఞను వచ్చే ఏడాది పరిచయం చేయబోతున్నట్టు ఈవెంట్లో చెప్పాడు బాలకృష్ణ. అయితే డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు. మోక్షజ్ఞను బోయపాటి లాంఛ్ చేయబోతున్నాడా..? అన్న వార్తలపై స్పందిస్తూ అంతా దైవేచ్చ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి కుమారుడి ఎంట్రీ ఈ సారి పక్కా అని చెప్పేసి చాలా కాలం నుంచి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు బాలయ్య.
అఖండ స్క్రీనింగ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ