Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్ద కర్మ (13వ రోజు) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవెంట్ సందర్భంగా మహేశ్‌బాబు (Mahesh Babu) ఉద్వేగానికి లోనయ్యాడు.
ఘట్టమనేని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్ద కర్మ (13వ రోజు) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవెంట్ సందర్భంగా మహేశ్‌బాబు (Mahesh Babu) ఉద్వేగానికి లోనయ్యాడు.
నాన్నగారు నాకు చాలా ఇచ్చారు. కానీ అన్నిటికన్నా గొప్పది ఆయన నాకు ఇచ్చింది మీ అభిమానం. దానికి నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. కృష్ణగారు భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. మీ గుండెల్లో ఉంటారు. ఆయనెప్పుడూ మన మధ్యనే ఉంటారు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని స్పీచ్ ముగించాడు.

మహేశ్ బాబు భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కోసం ప్రత్యేకంగా వంటకాలు రెడీ చేయించారు మహేశ్ బాబు. ఇప్పటికే కృష్ణకు ఆయన కోడలు నమ్రతా శిరోద్కర్ (Namratha Shirodkar) కృష్ణ సినీ ప్రయాణం, మైలురాళ్లు, రికార్డులతో డిజైన్ చేసిన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ఘనంగా నివాళులర్పించింది.
మహేశ్ బాబు స్పీచ్ వీడియో..
@urstrulyMahesh words for fen's & amp; On super star #Krishnagaru ❤️ pic.twitter.com/PSX3tWGi3y
— guntur karam 🌶️🌶️ (@SatishKumarDak5) November 27, 2022
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu |Nithiin | మారేడుమిల్లి షూటింగ్ స్పాట్లో నితిన్.. స్టన్నింగ్ లుక్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

