Nithiin | మారేడుమిల్లి షూటింగ్ స్పాట్లో నితిన్.. స్టన్నింగ్ లుక్ వైరల్
యువ హీరో నితిన్ (Nithiin) డైరెక్టర్ వంశీ(Vakkantham Vamshi)తో చేస్తున్న సినిమా ఈ ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలై.. తాజాగా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. కాగా ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్ నుంచి ఓ స్టిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు నితిన్.
టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేం డైరెక్టర్ వంశీ(Vakkantham Vamshi)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం షూటింగ్ తాజాగా మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. కాగా ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్ నుంచి ఓ స్టిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు నితిన్. గుబురు గడ్డం, స్టైలిష్ గాగుల్స్ తో బ్లాక్ షర్ట్ వేసుకుని వుడ్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తూ.. సైడ్ లుక్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజు ఇచ్చాడు నితిన్.
నితిన్ ఈ ఒక్క లుక్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా ఫస్ట్ షెడ్యూల్లో హీరో నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనుంది వంశీ అండ్ టీం. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. పెండ్లిసందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
మాచెర్ల నియోజకవర్గం సినిమా నితిన్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని కసిగా ఉన్నట్టు తాజా లుక్‌తో చెప్పేస్తున్నాడు నితిన్. మొత్తానికి ఈ యువ హీరో తాజా చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది.
నితిన్ స్టన్నింగ్ లుక్..
#NITHIIN32 begins 🤟 pic.twitter.com/TC5fW2X3Qu
— nithiin (@actor_nithiin) November 27, 2022
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

