టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజా చిత్రం అఖండ (Akhanda). మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు, ఫాలోవర్లతోపాటు సినీ ప్రేమికులంతా ఈవెంట్ లో అల్లరి చేస్తూ హోరెత్తించారు. ఈవెంట్లో బాలకృష్ణ ఓ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా మీ డౌటు.
ఇంకెవరో కాదు మరో నందమూరి స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (jr ntr) . స్టేజీపై అభిమానులతో సందడిగా సాగింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి, యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్బంగా మన జూ.ఎన్టీఆర్ నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంతోపాటు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప, చిరంజీవి నటిస్తోన్న ఆచార్యతోపాటు ఇతర సినిమాలను బాగా ఆదరించాలని ప్రేక్షక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించారు.
Mana Junior NTR 🥳🥁🤙
— HaRRRsha (@harshaBtech03) November 27, 2021
Crowd Response 🔥🔥#ManOfMassesNTR @tarak9999 #RRRMovie #Akanda pic.twitter.com/1A2nfyyhBo
అయితే స్టేజీపై బాలకృష్ణ నోట ఎన్టీఆర్ పేరు వినిపించగానే శిల్ప కళావేదిక ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. నందమూరి అభిమానులు తమ అరుపులు, కేకలతో ఈవెంట్లో గూస్బంప్స్ తెప్పించారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం అఖండ. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్