Simha | టాలీవుడ్లో కొన్నాళ్లుగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఈ స్టార్ హీరో కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఘరానా మొగుడు రీరిలీజ్ చేశారు. చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ కూడా రేపు రీరిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇక ఈ సారి మరో స్టార్ హీరో బాలకృష్ణ వంతు వచ్చేసింది. బాలకృష్ణ (Balakrishna) నటించిన చెన్నకేశవ రెడ్డి ఇప్పటికే మరోసారి థియేటర్లలో సందడి చేసింది. ఇక తాజాగా ఇండస్ట్రీకి పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును పరిచయం చేసిన చిత్రం సింహా (Simha) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బాలకృష్ణ-బోయపాటి కాంబో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సింహా కూడా రీరిలీజ్‌కు రెడీ అయింది. మార్చి 11న థియేటర్లలో సింహాతో మరోసారి గర్జించేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్, నయనతార, నమిత ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. 2010లో టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల్లో టాప్‌లో నిలిచింది సింహా. ఈ చిత్రంలో వేణు మాధవ్, కేఆర్ విజయ, చలపతి రావు కీలక పాత్రల్లో నటించారు.
సింహా చిత్రానికి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించారు. సింహా పాటలన్నీ ఆల్‌టైమ్ ఫేవరేట్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బీకే 108లో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
BLOCKBUSTER IS BACK AGAIN 🔥🔥
Natasimham #NandamuriBalakrishna & #BoyapatiSreenu 's Blockbuster #Simha World Wide Grand Re Release on 11th March 2023 💥🦁🦁#Chakri #ParuchuriKireeti pic.twitter.com/IZYdBh36Ia
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 2, 2023
Gopichand 31 | రూటు మార్చిన గోపీచంద్.. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో కొత్త సినిమా
Venkatesh | వెబ్ షోకు పనిచేయడం చాలా డిఫరెంట్.. వెంకటేశ్ చిట్ చాట్
Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..