ఒక సినిమా విజయం సాధించాలంటే ముందుగా ఉండాల్సింది కథ. అది బాగుంటే ఒక్కోసారి చిన్న నటీనటులు ఉన్నా కూడా సినిమా జనాల్లోకి వెళ్తుంది. అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ కొన్నిసార్లు కథ కాకరకాయ లేకపోయినా కూడా కేవలం స్టార్ హీరోలు ఉండటంతోనే సినిమాలు విజయం సాధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలాంటి అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా కూడా దీనికి నిదర్శనం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
కేవలం అభిమానులు మాత్రమే ఎంజాయ్ చేస్తారు సాధారణ ప్రేక్షకులు కచ్చితంగా తిప్పికొడతారని అందరూ అనుకున్నారు. ఓపెనింగ్స్ వస్తాయి కానీ నిలబడడం కష్టమే అని ట్రేడ్ పండితులు కూడా తేల్చేశారు. పైగా సినిమాకు 53 కోట్ల బిజినెస్ చేస్తే చాలామంది నవ్వుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ సినిమాకు 50 కోట్ల కలెక్షన్స్ ఎలా వస్తాయి.. ఆయన గత సినిమాలు ఒక్కటి కూడా కనీసం 40 కోట్ల మార్క్ అందుకోలేదు.. గౌతమీపుత్ర శాతకర్ణి పన్ను మినహాయింపు ఇస్తే కానీ నష్టాల నుంచి తప్పించుకోలేక పోయింది.. అలాంటి బాలయ్య సినిమాకు 50 కోట్ల బిజినెస్ చేస్తారా అంటూ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ కేవలం 4 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్.. 45 కోట్ల షేర్ వసూలు చేసి అందరి నోళ్ళు మూయించింది అఖండ.
నైజాం, ఓవర్సీస్ లో ఇప్పటికే లాభాలు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల కూడా 90% రిటర్న్స్ వచ్చేశాయి. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసిన తర్వాత సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమైంది. కథ కాకరకాయ అవసరం లేదు.. ఎమోషన్ తో అసలు పని లేదు.. కేవలం ఎలివేషన్స్.. ఊపిరి సలపనంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే చాలు మేము సినిమాను ఆడిస్తాము అని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. అఖండ జోరు చూసిన తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు రేసుగుర్రాల మాదిరి సిద్ధమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్