DQ 41 | మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఇటీవలే కొత్త తెలుగు సినిమాను ప్రకటించాడని తెలిసిందే. DQ41 (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ సినిమాను టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ ఎస్ఎల్వీ సినిమాస్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. కాగా మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు.
బాహుబలి స్టార్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. బాహుబలి ప్రాంచైజీలో శివగామి లాంటి పవర్ ఫుల్ రోల్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది రమ్యకృష్ణ. ఇంతకీ రమ్యకృష్ణ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీతో రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
ప్రస్తుతం DQ41 షూటింగ్ దశలో ఉంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ ఇటీవలే విడుదలైన లోక చాఫ్టర్ 1 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ బ్యానర్లో ప్రస్తుతం నాని నటిస్తోన్న ది ప్యారడైస్ కూడా ఉంది.
Ruling the big screens and hearts through generations with her timeless charm ❤️
Team #DQ41 wishes the ever elegant @meramyakrishnan Garu a very Happy Birthday ✨
Thrilled to announce that she would be playing a pivotal role in this beautiful tale.#SLVC10
Starring @dulQuer &… pic.twitter.com/FCQOlppfpm— SLV Cinemas (@SLVCinemasOffl) September 15, 2025
Mirai | మిరాయ్’లో శ్రీరాముడిగా నటించింది ఎవరో తెలుసా? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
OG | ఓజీ పిల్లర్స్ ఒకే ఫ్రేములో.. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ ట్వీట్