యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కానీ బాహుబలి కంటే ముందు టాలీవుడ్లో ఈయన్ని స్టార్‌గా మార్చిన దర్శకుడు కూడా రాజమౌళినే. 16 ఏళ్ల కింద వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమా సంచలన విజయం సాధించింది. ఎమోషనల్ ఎంటర్టైనర్గానే కాకుండా యాక్షన్ సీన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అదే ఛత్రపతి . ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. రాఘవేంద్ర సినిమాతో ప్లాఫ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ అయినా కూడా వెంటనే ప్రభాస్ మళ్లీ అడవి రాముడు, చక్రం లాంటి సినిమాలతో వెనకబడ్డాడు. అలాంటి సమయంలో వచ్చిన సినిమా ఛత్రపతి. ప్రభాస్ లోని మాస్ హీరోను పూర్తిగా బయటికి తీసుకొచ్చిన సినిమా ఇది. అప్పటికే స్టూడెంట్ నెం 1, సింహాద్రి, సై లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన రాజమౌళి.. ఛత్రపతిని సూపర్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్ పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో నింపేశాడు రాజమౌళి. ఈ సినిమా వచ్చి 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఫైనల్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 5.58 కోట్లు
సీడెడ్: 2.54 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.66 కోట్లు
ఈస్ట్: 1.08 కోట్లు
వెస్ట్: 0.93 కోట్లు
గుంటూరు: 1.27 కోట్లు
కృష్ణా: 1.11 కోట్లు
నెల్లూరు: 0.79 కోట్లు
ఏపీ + తెలంగాణ: 15.00 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.45 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 16.35 కోట్లు షేర్
ఛత్రపతి సినిమాకు అప్పట్లో 10 కోట్ల బిజినెస్ జరిగింది. చివరికి రూ. 16 కోట్లు వసూలు చేసింది. అంటే నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల పంట పండించిందన్నమాట. అప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే ఇదే. శ్రియ సరన్ అందాలు.. ఆర్తి అగర్వాల్ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. వేణు మాధవ్ కామెడీ సినిమాకు ప్రధాన బలం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన
Posani: పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు
Singam: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిన సింగం నటుడు
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి