Mohan Babu: నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు

ఏ విషయంపైనైన ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు రీసెంట్గా ఆలీ టాక్ షోకి గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో పలు విషయాల గురించి మాట్లాడిన ఆయన ఆలీని నీకు పొగరు ఎక్కువ అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టానంటూ మొహమాటం లేకుండా అనేశాడు. వివరాలలోకి వెళితే మోహన్ బాబు తను సినిమాలు నిర్మించే సమయంలో ఆలీకి ఖచ్చితంగా ఓ వేషం ఇచ్చేవాడు.
కాని కొన్ని రోజులకు ఆలీని కట్ చేసాడు.మోహన్ బాబు సినిమాలలో,ఆయన నిర్మించే సినిమాలో ఆలీ కనిపించలేదు.అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. దానిపై రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు మోహన్ బాబు. సినిమా అన్నప్పుడు విలన్ మరియు కమెడియన్ లు కూడా ఖచ్చితంగా అవసరం. నా సినిమాల్లో అందుకే నీకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాను. చాలా మంది కమెడియన్స్ ను నేను ప్రోత్సహించాను.
ఒక బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాము అంటే లక్ష రెండు లక్షల వద్ద బేరాలు ఆడవద్దు. నీకు పొగరు ఎక్కువ అయ్యి ఆ పని చేశావు. అందుకే నేను వదిలేయాల్సి వచ్చిందని అన్నాడు. ఒక సినిమా సమయంలో అలా బేరాలు ఆడటం వల్లే అలీని నేను కట్ చేయాల్సి వచ్చిందని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోహన్ బాబు కెరీర్ ఆరంభంలో హీరోగా విలన్ గా చేసిన సమయంలో.. తాను సినిమాలు నిర్మించిన సమయంలో ఖచ్చితంగా ఆలీకి పాత్ర ఇచ్చేవాడు. కాని కొంత కాలం తర్వాత అలీకి తన సినిమాల్లో పూర్తిగా కట్ చేశాడు. మోహన్ బాబు ఎందుకు అలా చేస్తున్నాడు అని అప్పట్లో కొందరు అనుకున్నారు కూడా. మోహన్ బాబు సినిమాలో అలీ ఎందుకు ఉండటం లేదు అనే వారికి ఎట్టకేలకు సమాధానం దక్కింది. అలీ వరుసగా మోహన్ బాబు సినిమాల్లో.. ఆయన నిర్మిస్తున్న సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఒక సినిమా సమయంలో లక్ష రెండు లక్షల పారితోషికం వద్ద తేడా వచ్చి నటించేందుకు నో చెప్పాడా లేదా మరేంటో జరిగిందట. దాంతో మోహన్ బాబుకు కోపం వచ్చి అప్పటి నుండి అలీని పక్కకు పెట్టేశాడట. ఆ విషయాన్ని స్వయంగా అలీతో మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. నీకు పొగరు ఎక్కువ ఉండటం వల్ల మద్యలో కొన్నాళ్లు నిన్ను కట్ చేశాను అన్నాడు.
సినిమా అన్నప్పుడు విలన్ మరియు కమెడియన్ లు కూడా ఖచ్చితంగా అవసరం. నా సినిమాల్లో అందుకే నీకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాను. చాలా మంది కమెడియన్స్ ను నేను ప్రోత్సహించాను. నీవు కూడా నా చాలా సినిమాల్లో నటించావు. ఒక బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాము అంటే లక్ష రెండు లక్షల వద్ద బేరాలు ఆడవద్దు. నీకు పొగరు ఎక్కువ అయ్యి ఆ పని చేశావు. అందుకే నేను వదిలేయాల్సి వచ్చిందని అన్నాడు. ఒక సినిమా సమయంలో అలా బేరాలు ఆడటం వల్లే అలీని నేను కట్ చేయాల్సి వచ్చిందని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.
మోహన్ బాబు మరియు అలీల మద్య పలు విషయాల గురించి చర్చ జరిగింది. అలీ మరియు మోహన్ బాబుల మద్య చాలా మంచి సన్నిహిత్యం ఉందని ఆ టాక్ షో ద్వారా క్లారిటీ వచ్చింది. మోహన్ బాబు మళ్లీ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. కనుక ఆయన ప్రతి సినిమాలో కూడా ఇకపై అలీ ఉంటాడేమో చూడాలి. అలీ ఈమద్య కాలంలో కమెడియన్ గా సినిమాలు కాస్త తగ్గించాడు. ఆఫర్లు కూడా గతంలో మాదిరిగా వస్తున్నట్లుగా లేవు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. చేసిన కొన్ని సినిమాలు అయినా మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలను అలీ కాదంటున్నట్లుగా తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Comedian ali
- mohan babu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

