ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 08:47:40

క‌ష్టాలని త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల‌నుకున్న జ‌బ‌ర్ధ‌స్త్ స్టార్

క‌ష్టాలని త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల‌నుకున్న జ‌బ‌ర్ధ‌స్త్ స్టార్

కామెడీతో ప్రేక్ష‌కుల‌ని కడుపుబ్బ న‌వ్వించే క‌మెడీయ‌న్స్ జీవితంలో కూడా ఎన్నో క‌ష్టాలు ఉంటాయి. వారికి ఎన్ని క‌ష్టాలు ఉన్న‌ప్ప‌టికీ వాట‌న్నింటిని దిగ‌మింగుకొని ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తుంటారు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో పాపుల‌ర్ అయిన అవినాష్ జీవితంలోను ఎన్నో క‌ష్టాలు ఉన్నాయ‌ట‌. బిగ్ బాస్  సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన అవినాష్ మార్నింగ్ మ‌స్తీలో భాగంగా అమ్మ‌పై ప్రేమ‌, ఫ్యామిలీ కోసం ప‌డ్డ క‌ష్టాల‌ను చెప్పాడు.

జీవితంలో నేను రెండు విష‌యాలు న‌మ్ముతా అని అవానాష్ అన్నాడు. త‌ల్లిదండ్రులు, ప్రేక్ష‌కులు నా దేవుళ్లు. ఫ్రెండ్స్ కూడా నా ఫ్యామిలీ కిందే వ‌స్తారు. వారిని వేరు చేయ‌లేను. ప్ర‌స్తుతం నా వ‌య‌స్సు 30 కాగా, ఇటీవ‌ల ఇల్లు, కారు కొనుకున్నాను. ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం ప్రేక్ష‌క దేవుళ్ళే. అయితే క‌ష్టాలతో పోటీ ప‌డ‌లేక‌ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాను అని అవినాష్ అన్నాడు.

ఈఎమ్ఐతో ఇల్లు కొనుకున్న స‌మ‌యంలో మా నాన్న‌కు గుండెపోటు వ‌చ్చింది. మూడు స్టంట్స్ వేయాల‌న్నారు. ఇంటి కోసం దాచుకున్న రూ.4ల‌క్ష‌లు నాన్న ఆప‌రేష‌న్ కోసం ఖ‌ర్చు పెట్టా. అదే స‌మ‌యంలో అమ్మ కీళ్లు అరిగిపోతే వైద్యం చేశాను. నెల‌కు రూ.45వేల రూపాయ‌లు క‌ట్టుకోలేని ప‌రిస్థితి ఉండ‌డంతో బ‌య‌ట అప్పు చేశాను. మేం ఐదుగురు అన్నదమ్ములం.. వాళ్లు డబ్బు పెట్టే పరిస్థితి లేకపోవడంతో నేను ఖర్చు చేయాల్సి వచ్చింది. ముందు ఇల్లుకు కొంత అడ్వాన్స్ ఇవ్వ‌డం వ‌ల‌న త‌ప్ప‌ని స‌రిగా క‌ట్టాల్సి వ‌చ్చింది. దీంతో  రూ. 13 లక్షలు అప్పు చేశాను అని అవినాష్ పేర్కొన్నాడు.

నేను ఇంత రిస్క్ చేసింది నా పేరెంట్స్ కోస‌మే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం వారే. చ‌నిపోయిన త‌ర్వాత బాధ‌ప‌డే కంటే ఉన్న‌ప్పుడే వారిని మంచిగా చూసుకుంటే బాగుంటుంది. త‌ల్లిదండ్రుల‌ని ఓల్డేజ్ హోమ్‌లో వేయ‌కండి అంటూ సందేశం ఇచ్చాడు అవినాష్‌. అయితే అవినాష్ ఆలోచ‌న‌పై మండిప‌డ్డ రాజ‌శేఖర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని ఎలా అనుకున్నావు అని ప్ర‌శ్నించాడు. నేను రూ.6 కోట్ల ఇల్లు క‌ట్టాను, కానీ అమ్మేశాను. దానిని చూసుకోవ‌డం త‌ప్ప చేసేదేం లేదు. ఆర్టిస్ట్‌లు ఇలా ఆలోచిస్తే ప్ర‌తి రోజు చ‌నిపోవాలి అని అన్నాడు. దీనికి అవినాష్ ఆ స‌మ‌యంలో అలా అనిపించిందంతే అని చెప్పాడు. ఏదేమైన అవినాష్ ఆలోచ‌న ధోర‌ణి నూటికి నూరు శాతం త‌ప్పు అని ప్రేక్ష‌కులు కూడా అంటున్నారు. 


logo