Atlee | శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాంతార ఫీవర్ సెలబ్రిటీలను కూడా తాకిందంటే సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
కాంతార చాఫ్టర్ 1 రూ.500 కోట్ల మైల్‌స్టోన్‌ను అధిగమించి.. ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కాగా కాంతార చాప్టర్ 1 కోసం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఏ స్థాయిలో జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మూవీ విడుదలైనప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాడట. దీనికి సంబంధించి ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు అట్లీ.
ఆమ్స్టర్ డమ్‌లో కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రెండున్నర గంటలపాటు డ్రైవ్ చేసుకుంటూ థియేటర్‌కు వెళ్లానని చెప్పాడు. అంతేకాదు సినిమా చూసిన వెంటనే తాను రిషబ్ శెట్టికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశానన్నాడు. రిషబ్ శెట్టి తనకు మంచి స్నేహితుడని.. తాను ఎంతో గౌరవించే వ్యక్తుల్లో ఒకరని అన్నాడు అట్లీ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి మరోసారి స్టన్నింగ్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్‌ను అదరగొట్టేస్తున్నాడు. గ్రిప్పింగ్ కంటెంట్‌తో వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో డివైన్, మిథికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జయరామ్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్ , గుల్షన్ దేవయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!