RT76 | అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే భాను భోగవరపు దర్శకత్వంలో నటిస్తోన్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కాగా ఈ సినిమా రీలీజ్ కాకముందే రవితేజ కొత్త సినిమా వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ RT76. ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ మూవీ అప్డేట్ షేర్ చేసి మూవీ లవర్స్, అభిమానుల్లో జోష్ నింపుతోంది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో కొనసాగుతోంది.
స్పెయిన్‌లో సాంగ్ షూట్ పూర్తయిన సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ షూట్‌తో స్పెయిన్ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలిపింది. రవితేజ్ అండ్ టీం త్వరలోనే ఇండియాకు తిరిగిరానుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ ప్రాజెక్టు 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇండియాకు తిరిగిరాగానే మాస్ జాతర ప్రమోషన్స్‌తో బిజీ కానున్నాడు రవితేజ. ఈ చిత్రలో రవితేజ రైల్వే పోలీసాఫీసర్‌గా సందడి చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్ నీ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
#RT76 –
The Spain schedule has wrapped up, and the team will return to India very soon.
After returning to India, #RaviTeja will resume promotional activities for #MassJathara aggressively. pic.twitter.com/QS7l34wZid
— MOHIT_R.C (@Mohit_RC_91) October 22, 2025
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ