Producer Nagavamsi | మలయాళంలో రికార్డులు సృష్టించిన ‘లోక-చాప్టర్ 1’ సినిమా తెలుగులో తెరకెక్కించి ఉంటే డిజాస్టార్‌గా నిలిచి ఉండేదని తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ. తన బ్యానర్ సితార ఎంటర్టైనమెంట్స్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోటుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నాగవంశీ కొత్త లోక సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కొత్త లోక సినిమాను తెలుగులో తీసి ఉంటే అట్టర్‌ఫ్లాప్, డిజాస్టర్ అయ్యేదని తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు లాజిక్‌లు, రియాలిటీ గురించి మాట్లాడుతూ ఇదేం సినిమా? అని ప్రశ్నిస్తూ ఫ్లాప్ చేసేవాళ్లు. మలయాళ ప్రేక్షకులు కథలో మునిగి పోతారు, ఎమోషన్స్‌కు లోనవుతారు. అదే తెలుగులో జరిగితే.. పచ్చి బూతులు తిట్టేవాళ్లు ఇలాంటి క్రాస్-కల్చరల్ కంటెంట్‌కు మా ప్రేక్షకుల అడాప్టబిలిటీ కీలకం అని నాగవంశీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగవంశీ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు తన బ్యానర్ నుంచి వచ్చిన వార్ 2 ఫ్లాప్ గురించి కూడా మాట్లాడిన నాగవంశీ ఆదిత్య చోప్రాను నమ్మాం, కానీ మిస్‌ఫైర్ అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది అని ఓపెన్‌గా చెప్పారు.
“If #Lokah was made directly in Telugu, the Telugu audience would have made a lot of complaints, and the film would have become a disaster.”
– #NagaVamsi pic.twitter.com/AeD7WOw9bQ
— Movies4u Official (@Movies4u_Officl) October 21, 2025