Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె – రణ్వీర్ సింగ్ దంపతులు గత ఏడాది సెప్టెంబర్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. వీరి పాపకు “దువా” అని పేరుపెట్టుకున్నారు. అయితే ఇతర సెలబ్రిటీలలాగే వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ “ నో ఫోటో పాలసీ ”ని అనుసరిస్తూ వచ్చారు. అంటే తమ కూతురి ముఖాన్ని మీడియా లేదా సోషల్ మీడియాలో బహిర్గతం చేయలేదు. ఓ సారి దీపికా తన పాప దువాతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా, పాపరాజీలు వీడియో తీసేందుకు ప్రయత్నించగా, దీపిక వెంటనే గమనించి రికార్డింగ్ ఆపేయమని గట్టిగా చెప్పింది. పాప ముఖం కెమెరాలో పడకూడదనే ఉద్దేశంతో ఆమె అక్కడే వీడియో తీసిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేసింది.
ఆ సమయంలో చాలామంది దీపిక నిర్ణయాన్ని సమర్థించారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు దాన్ని గౌరవించాలి”, “ప్రతి పిల్లకి ప్రైవసీ హక్కు ఉంది” అంటూ కామెంట్లు చేసారు. సెలబ్రిటీ పిల్లలపైన పాపరాజీలు ఇలా ప్రవర్తించడం తప్పు అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణ్ వీర్ సింగ్ , దీపికా పదుకుణే ల జంట దీపావళి వేడుకులను వైభవంగా జరుపుకున్నారు. కూతురు దువాతో కలిసి జరుపుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సారి వారి ఇంట దివాళీ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి అనే చెప్పాలి.
అయితే ఇన్నాళ్లు తమ కూతురి ఫేస్‌ని సీక్రెట్‌గా ఉంచిన దీపిక,రణ్వీర్ సింగ్ జంట దీపావళి పండుగని పురస్కరించుకొని కూతురు దువాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ దువా చాలా క్యూట్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇక దీపికా విషయానికి వస్తే.. ఇటీవల ‘కల్కి 2898 AD’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దీపికా పదుకొనె, ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించబోతోంది. ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ విజువల్ వండర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.