Tollywood | ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేమికులకు ప్రత్యేకం కానుంది. డిసెంబర్ 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌గా జరుపుకునే పర్వదినం కాగా, ఈసారి తెలుగునాట రికార్డ్ స్థాయిలో ఆరు సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ వార్ కోసం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా ‘డెకాయిట్ (Dacoit)’, రోషన్ హీరోగా రోషన్ మేకా డైరెక్షన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్ (Champion)’, ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ న్యాచురల్ మూవీ ‘శంబాల (Shambala)’, విశ్వక్ సేన్ నటించిన కామెడీ జానర్ ‘ఫంకీ (Funky)’, గుణశేఖర్ డైరెక్షన్లో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన ‘యూఫోరియా (Euphoria)’, అలాగే కొత్త దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ‘పతంగ్ (Patang)’ చిత్రాలు డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షనీల్ డియో డైరెక్షన్లో రూపొందిన ‘డెకాయిట్’ యాక్షన్ డ్రామా కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతకంలో రూపుదిద్దుకుంది. రోషన్ హీరోగా తెరకెక్కిన ‘ఛాంపియన్’ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందగా, ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ వంటి సంస్థలు నిర్మించటం విశేషం. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పతంగ్’ కైట్స్ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది. ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన ‘శంబాల’ సూపర్ న్యాచురల్ పవర్స్ నేపథ్యంలో సాగే సినిమా. విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ అనేది కామెడీ జానర్లో ప్రేక్షకులను అలరించనుంది, ఇది నాగవంశీ నిర్మాణంలో రూపొందింది. గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన ‘యూఫోరియా’ మూవీ డ్రగ్స్ కారణంగా చెడుదారిన పాడిన యువతకు ఒక సందేశం అందిస్తూ వస్తోంది.
డిసెంబర్ 25వ తేదీని ఈ ఆరు సినిమాలు ఒకేసారి రిలీజ్ డేట్‌గా ఎంచుకోవడం ఆసక్తిని రేపుతుంది.. ప్రేక్షకుల మదిని ఏ సినిమా ఎక్కువ ఆకర్షిస్తుందో, ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ క్రిస్మస్, తెలుగు సినీ అభిమానులకు ఫుల్ ఫన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ అందించనుంది.