Archana | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి అర్చన (వేద శాస్త్రి). నేను, శ్రీరామదాస్ సినిమాలతో మంచి ఫేం సంపాదించిన ఈ భామ ఆ తర్వాత పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. చివరగా కృష్ణమ్మ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ ప్రస్తుతం వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘కర్మ స్థలం’. రాకీ షెర్మన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
రాయ్ ఫిల్మ్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణం రాకీ షెర్మన్ తెరకెక్కిస్తున్నారు. మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేళ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేశ్, దిల్ రమేశ్, చిత్రం శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించామంది అర్చన. క్వాలిటీ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తుందో సినిమా కూడా అంతే ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చింది అర్చన. మేమంతా ప్రాణం పెట్టి.. ఎంతో ఇష్టంతో పని చేసిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని డైరెక్ట్ రాకీ షెర్మన్ చెప్పాడు.
కర్మ స్థలం ఒక మంచి మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా …మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్ ఇందులో హైలైట్ – హీరోయిన్ #ArchanaShastry #KARMASTALAM pic.twitter.com/lu3NbFJF6n
— SR Promotions (@SR_Promotions) February 4, 2025
First Look of Mythological Action Extravaganza #KARMASTALAM Promises Spine-chilling and Spiritual Adventure#ArchanaShastry , #MitaliChauhan#RoyFilms#KalakeyaPrabhakar#BalagamSanjay#VinodAlva#RockySherman#SrinivasSubramanya#MLRaja #SirishPrasad #MadhuChiragani… pic.twitter.com/oZbgRIlrj1
— SR Promotions (@SR_Promotions) February 2, 2025
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?