మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 16:48:20

బాలుకు భార‌త‌ర‌త్నఇవ్వాలి..:మోడీకి జ‌గ‌న్ లేఖ‌

బాలుకు భార‌త‌ర‌త్నఇవ్వాలి..:మోడీకి జ‌గ‌న్ లేఖ‌

వేల పాటలకు ప్రాణం పోసిన  గాన గంధర్వుడు ఊపిరి ఆగిపోయిందన్న వార్త సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టివేసింది. ఆయ‌న తిరిగి రాని లోకాలకు వెళ్ళార‌నే వార్త‌ను ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 16 భాష‌ల‌లో 50 వేలకు పైగా పాట‌లు పాడిన బాల సుబ్ర‌హ్మ‌ణ్యం భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయిన పాట రూపంలో చిర‌స్థాయిగా నిలిచి ఉంటారు. అయితే ఎన్నో అవార్డుల‌ను ద‌క్కించుకున్న బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే డిమాండ్ వినిపిస్తుంది.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సంగీత ప‌రిశ్ర‌మ‌కు చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ర‌త్న ఇవ్వాల‌ని అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు డిమాండ్ చేస్తున్నారు. హీరో అర్జున్ .. బాలు అంత్య‌క్రియ‌లకు హాజరైన స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ .. ఎస్పీబీకు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్న త‌ప్ప‌క ఇవ్వాలి.  తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇండ‌స్ట్రీలు అన్ని క‌లసి రావాలి. 45 వేల పాట‌లు రెండు జ‌న్మ‌లు ఎత్తిన పాడ‌లేరు అని అర్జున్ పేర్కొన్నారు. 

బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్స్ పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ .. ప్ర‌ధాని మోడీకి లేఖ రాసారు. ఎస్పీ బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు ఎస్పీ చ‌ర‌ణ్ త‌న తండ్రికి భార‌త‌ర‌త్న ఇస్తే సంతోషిస్తాం అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. 


logo