ఆరేళ్ల కింద మలయాళ ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో తెలుగులోనూ మంచి అవకాశాలు దక్కించుకుంది. త్రివిక్రమ్ అ..ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్‌కు వచ్చి రాగానే మంచి హిట్స్ అందుకుంది. మొదట్లో గోల్డెన్ లెగ్ అనుకున్నా తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో కెరీర్ కూడా డల్ అయిపోయింది. అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాకే పరిమితమైన అనుపమ.. అప్పుడప్పుడు ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే పొలంలో పంట కూడా పండించింది అనుపమ. దీనికి సంబంధించిన అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పిక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం అనుపమ.. నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే అనుపమ చేతిలో మరో సినిమా లేదు. మలయాళంలోనూ ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్లు చేస్తూ రచ్చ చేస్తుంది. దీనికి తోడు కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్న అనుపమ.. పక్కనే ఉన్న తమ పొలంలో వ్యవసాయం చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తపియోక అనే దుంపలను పట్టుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది అనుపమ. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!