తెలుగు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి 18 పేజెస్ (18 Pages). నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డిసెంబర్ 23న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో నిఖిల్, అనుపమ ట్రైలర్ (18 pages Trailer) ఎప్పుడనేది తెలియజేశారు. డిసెంబర్ 17న ట్రైలర్ రాబోతున్నట్టు పుస్తకంలోని పేజీపై డిస్ప్లే చేస్తూ సరికొత్తగా ప్రకటించారు. 18 పేజెస్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 18 పేజెస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ మూవీ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. 18 పేజెస్ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్, ఆహా.. శాటిలైట్ రైట్స్ ను జీ ఛానల్ దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్త నిర్మాణంలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. 18 పేజెస్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీనందిస్తున్నాడు.
18 పేజెస్ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వీడియో..
This 𝟏𝟕𝐭𝐡 𝐃𝐄𝐂 💥 Bringing you the Exciting, Enthralling Trailer of the Crazy Love Story ~ #18Pages 🤩
Get ready to Witness the Fun & Madness of #18PagesTrailer 🤩
▶️ https://t.co/h1DBXovhkv @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl pic.twitter.com/euwOw37w21— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also :Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?