కోల్‌కతా: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌కు ఐపీఎల్ నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా ఐపీఎల్లో పోటీపడే ప్లేయర్ల జీతాలకు బీమా కల్పిస్తారు. అయితే విదేశీ క్రికెటర్లు క్యాంప్‌లో చేరిన తర్వాత లేదా టోర్నీ సమయంలో గాయపడితే సదరు ఫ్రాంచైజీ పరిహారం చెల్లిస్తుంది.
కానీ ముస్తాఫిజుర్ విషయంలో ఇది జరుగలేదు కాబట్టి అతనికి పరిహారం పొందే చాన్స్ లేదు. ప్రస్తుతం బీమా కంపెనీ నిబంధనల్లోకి ముస్తాఫిజుర్ కేసు రాదని నిర్వాహకులు పేర్కొన్నారు.