ANR 100 | దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు (Akkineni Nageswara Rao) శత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 20న 100వ జయంతిని పురస్కరించుకొని ఏఎన్ఆర్ క్లాసికల్ చిత్రాలను గుర్తు చేసుకుంటూ.. ఆయన కెరీర్లో మరుపురానివిగా నిలిచిపోయిన ఐకానిక్ సినిమాలను రీరిలీజ్ చేయనున్నారు.
శత జయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నటించిన 10 ఐకానికి చిత్రాలను దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేయబడ్డ పీవీఆర్-ఐనాక్స్ థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయి. ఫిల్మ్ హెరిటేజ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్ ఇండియా ఈ చిత్రాలను విడుదల చేయనున్నాయి. అక్కినేని నాగేశ్వర రావు టైమ్‌లెస్ క్లాసిక్స్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుండటం అభిమానులను గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రీరిలీజ్ కాబోయే చిత్రాలివే..
దేవదాసు (1953), మైసమ్మ (1955), మాయా బజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)
10 Classics – 25 Cities
Sep 20 – 22
Celebrating #ANR100 #ANRLivesOnFilm Heritage Foundation @FHF_Official
National Film Archive India @NFAIOfficial
PVR INOX Ltd @PicturesPVR pic.twitter.com/By9vpCyuAn— Sushanth A (@iamSushanthA) September 4, 2024