Dacoit | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం డెకాయిట్ (Dacoit). ఈ చిత్రానికి షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తుండగా.. ఇప్పటికే లాంచ్ చేసిన డెకాయిట్ టైటిల్ టీజర్.. మాజీ ప్రేమికుల శత్రుత్వంతో సినిమా కొత్త పంథాలో సాగబోతుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
అయితే ఎవరూ ఊహించని విధంగా డెకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకుందని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. తన పాత్రకు సంబంధించి, ప్రొడక్షన్ హౌస్‌తో నెలకొన్న సమస్యల కారణంగా నేపథ్యంలో శృతిహాసన్ సినిమా నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో మరో పాపులర్ హీరోయిన్ను శృతిహాసన్ ప్లేస్‌లో తీసుకున్నారట. అంతేకాదు వచ్చే వారమే ఆ హీరోయిన్ ఎవరో చెప్పబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే మరోసారి టైటిల్ టీజర్ నుంచి మరోసారి షూటింగ్ మొదలుపెట్టాల్సిందేనన్నమాట.
అడివి శేష్ ఇప్పటికే ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్