Jr NTR | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా వస్తుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన దేవర సాంగ్స్, ట్రైలర్‌తో అనిరుధ్ బీజీఎం లెవల్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం గ్యారంటీ అని చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా తారక్ చేసిన కామెంట్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దేవర టీంతో చేసిన చిట్‌చాట్‌లో అనిరుధ్ కంపోజిషన్ గురించి చెప్పుకొచ్చాడు తారక్.
అనిరుధ్ దేవర స్కోర్ హాలీవుడ్ స్థాయి కంటే ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. దేవర స్కోర్ వరల్డ్ క్లాస్‌లో ఉంటుంది. అనిరుధ్ తప్పకుండా ఈ సినిమాతో హాలీవుడ్లో తన మార్క్‌ను చూపిస్తాడని.. ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు దేవరకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైరగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ట్రైలర్లో అసలెవరు వాళ్లంతా.. కులం లేదు.. మతం లేదు.. భయమే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి..చాలా పెద్ద కథ సామి.. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ సాగుతున్న డైలాగ్స్ దేవరపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!