Pepsi Sharma | హర్యాన్వీ యువ సింగర్ పెప్సీ శర్మ మృతి.. గుండెపోటే కారణం
Pepsi Sharma : హరియాణాకు చెందిన ప్రముఖ యువ జానపద గాయకుడు పెప్సీ శర్మ (38) గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో అభిమానులు, తోటి కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Pepsi Sharma : హరియాణాకు చెందిన ప్రముఖ యువ జానపద గాయకుడు పెప్సీ శర్మ (38) గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో అభిమానులు, తోటి కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెప్సీ శర్మకు గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పెప్సీ శర్మ అసలు పేరు యశ్పాల్ శర్మ. ఆయన హరియాణాలోని ఘజియాబాద్‌లోని పాట్లా గ్రామానికి చెందిన వారు. ఆయనకు హరియాణాతోపాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మంచి గాయకుడిగా పేరుంది. అలాగే, ఆయన రాగిణి కళాకారుడు కూడా. నాగిని డ్యాన్స్‌తో కూడా వినోదం పంచారు. ముఖ్యంగా ఆయన చేసిన ఈ డ్యాన్స్ చాలా గుర్తింపు తీసుకొచ్చింది. రాగిణి ఈవెంట్స్, స్టేజిపై స్థానిక జానపద పాటలు పడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నారు.
दुखद खबर: हरियाणवी कलाकार पेप्सी शर्मा का निधन हो गया। सीने में दर्द के बाद उन्होंने अंतिम सांस ली।
UP और हरियाणा की रागनी दुनिया में उनकी पहचान एक दमदार कलाकार के रूप में थी।
भावपूर्ण श्रद्धांजलि।#PepsiSharma #RIP #HaryanviArtist #Ragni pic.twitter.com/5EsfS3qXI8
— Payall Singhh (@PayallSingh13) June 8, 2026
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, బాద్షా వంటి వారి ముందు ఆయన తన ప్రదర్శన ఇచ్చారు. ఆయన చేసిన నాగిన డ్యాన్స్ సహా అనేక వీడియోలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. పెప్సీ శర్మ మృతిపై హరియాణాకు చెందిన రాజకీయ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

