8 Vasantalu | మ్యాడ్ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శుద్ధి అయోధ్య అనే పాత్రలో నటిస్తోంది అనంతిక. దసరా కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం అనంతిక సనిల్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. శుద్ధి అయోధ్య రోల్‌లోకి అనంతిక ఎలా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యిందో తెలియజేసే వీడియో ఒకటి షేర్ చేశారు మేకర్స్. అనంతిక ఈ సినిమాతో పక్కా హిట్టు కొట్టాలని చూస్తున్నట్టు వీడియో చెప్పకనే చెబుతోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఓ అమ్మాయి తనకున్న బాధల్లోని నుంచి బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో ఎలా ప్రావీణ్యం సంపాదించిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనిపిస్తుంది..అంటూ వచ్చే డైలాగ్ సినిమా మహిళా లోకానికి స్ఫూర్తి నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూపించే కాన్సెప్ట్‌తో సినిమా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.
The amazing transformation of @Ananthika108 to Shuddhi Ayodhya#8Vasanthalu
▶️ https://t.co/lDcgRJZVrh pic.twitter.com/RJn7Y3hXgD— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2024
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్