Pottel | మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో నటిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది టాలీవుడ్ భామ అనన్య నాగళ్ల (anannya nagalla). ఈ భామ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్ (Pottel). ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన బుజ్జి మేక (Bujji meka song) సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. గుర్రంగట్టు ప్రాథమిక పాఠశాల ముందు తన కుటుంబంతో దిగిన లుక్ ఒకటి షేర్ చేస్తూ.. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే విడుదల తేదీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పొట్టేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింబే బోనాల పండుగను హైలెట్ చేస్తున్న దృశ్యాలు.. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం లాంటి విషయాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!❤️
Team #Pottel and the GurramGattu villagers wish you a Happy Independence Day🇮🇳
In theatres this DUSSEHRA 2024💥 pic.twitter.com/bJLOAYY0zB
— BA Raju’s Team (@baraju_SuperHit) August 15, 2024
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !