Amitabh Bachchan | గతేడాది గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). 80 ఏండ్ల వయస్సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు బిగ్ బీ. ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్-Kలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ పింక్‌లో లాయర్‌గా మెరిసిన విషయం తెలిసిందే.
తాజాగా మరో కోర్టు రూం డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ నటిస్తున్న కొత్త చిత్రం సెక్షన్ 84 (Section 84). రిభు దాస్‌గుప్తా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. యుధ్, Te3n సినిమాల తర్వాత అమితాబ్ బచ్చన్‌తో రిభుదాస్ గుప్తా తెరకెక్కిస్తున్న మూడో సినిమా కావడం విశేషం. సెక్షన్ 80 షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ హంగర్, సరస్వతి ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. అమితాబ్ క్రియేటివ్ మైండ్స్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో మరోసారి భాగస్వామ్యం అవుతుండటం సంతోషంగా ఉంది.. అంటూ కొత్త సినిమా అప్డేట్ వీడియోను షేర్ చేసుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. టైపింగ్ మిషన్‌తో టైటిల్ నేమ్ టైప్ చేస్తున్న విజువల్స్ తో రిలీజ్ చేసిన అప్డేట్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
T 4572 – .. a delight once again to be in the company of distinguished creative minds for this new venture , and the challenge it provokes, for me .. #Section84 @ribhudasgupta @RelianceEnt @FilmHangar #SaraswatiEntertainment @jiostudios pic.twitter.com/ggVYMru6PD
— Amitabh Bachchan (@SrBachchan) March 1, 2023
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్