ముంబై, డిసెంబర్ 16 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో తొలిసారి 91 మార్కును దాటింది. సోమవారం ముగింపుతో చూస్తే 15 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 90.93 వద్ద ముగియగా, ఒకానొక దశలో 91.14 స్థాయికి దిగజారింది.
ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠం. కాగా, గడిచిన 10 ట్రేడింగ్ సెషన్లలో 90 నుంచి 91 మార్కుకు రూపీ విలువ పడిపోయింది. ఈ 10 రోజుల్లో విలువపరంగా రూపాయి నష్టం వాటిల్లింది.