నాగ్‌పూర్, డిసెంబర్ 16 : ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్‌కు సరికొత్త ట్యాంక్ స్టాండ్లను పరిచయం చేసింది. 100 శాతం ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారుచేసిన ఈ స్టాండ్లు.. సంప్రదాయ సిమెంట్ దిమ్మెల కంటే ఎంతో నాణ్యమైనవని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొన్నది.
160 ఎంఎం ఎత్తు కలిగిన ఈ స్టాండ్లకు 10 ఏండ్ల గ్యారెంటీ ఉంటుందని, వినియోగదారులు ఈ స్టాండ్ల కింద ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చని, తద్వారా ట్యాంకులు కూడా చాలా ఏండ్లపాటు మన్నికగా ఉంటాయని వెల్లడించింది. కాగా, 500, 750, 1,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులకు సరిపడేలా ఈ స్టాండ్లున్నాయి.