Amitabh Bachchan | ఇండియాలో సూపర్ పాపులర్ టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది కౌన్ బరేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) . 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక 17వ సీజన్ మరోసారి టీవీల్లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
17వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బీ కేవలం వారానికి ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. వారంలో ఐదు ఎపిసోడ్స్కుగాను ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు నేషనల్ మీడియాలో ఓ కథనం ఇప్పుడు రౌండప్ చేస్తోంది. దీంతో అమితాబ్ బచ్చన్ ఇండియాలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టెలివిజన్ హోస్ట్‌గా నిలిచారు.గతంలో బిగ్ బాస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వీకెండ్ వార్ ఎపిసోడ్స్‌కు సల్మాన్ ఖాన్ అత్యధికంగా రూ.24 కోట్లు అందుకున్నాడు. తాజాగా ఈ ఫిగర్‌ను అధిగమించి మరోసారి వార్తల్లో నిలిచారు బిగ్‌బీ.
2000 సంవత్సరం నుంచి కౌర్ బనేగా కరోర్‌పతి సీజన్లకు మూడో సీజన్ మినహా అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిసిందే. మూడో సీజన్‌కు షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. సుదీర్ఘకాలంగా అన్ని సీజన్లను హోస్ట్‌గా కనిపిస్తున్న లెజెండరీ యాక్టర్ బిగ్ బీకి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం ఆయనకు స్థాయికి తగిన గుర్తింపునివ్వడమని బీటౌన్ జనాలు అంటున్నారు.
సోనీ టీవీ ఏప్రిల్ 4న అమితాబ్ బచ్చన్‌తో వీడియో ప్రోమోను విడుదల చేసి కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17ను ప్రకటించింది. ఆగస్టు 11 నుంచి ప్రీమియర్ కానుంది.
Manchu Vishnu | రామాయణంపై దృష్టి పెట్టిన మంచు విష్ణు.. రావణుడిగా మోహన్ బాబు, రాముడిగా?